మానేరు రివర్ ఫ్రంట్‌పై నీలి నీడలు
8 నెలలుగా నిలిచిన పనులు
పెండిరగ్‌లో పనులు, మంజూరు కాని బిల్లులు
ప్రాధాన్యత ఇవ్వని సర్కారు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
‘‘ అహ్మదాబాద్ సబర్మతి తరహాలో కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం’ మాజీ సీఎం కేసీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లకు కలల సౌదం ఇది. ఇరు వైపుల పార్కులు, వాటర్ ఫౌంటెన్లు, థీమ్ పార్కులు, వాటర్ స్ఫోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటెన్..ఇలా సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి 2021 మార్చి నెలలో శంకుస్థాపన చేశారు. ఇందుకు రూ. 410 కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 2023 ఆగస్టు వరకు ప్రారంభించాలనే అప్పటి లక్ష్యం నెరవేర లేదు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. గత 8 నెలలుగా పనులు నిలిచి పోవడంతో పాటు బిల్లులు కూడా పెండిరగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మానేరు రివర్ ఫ్రంట్ పనులను కొనసాగించి పూర్తి చేస్తుందా ? లేక ప్రాజెక్టునే రద్దు చేస్తుందా..? అనే దానిపై సంగ్ధిద్దత నెలకొంది.
నిలిచిపోయిన పనులు
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులకు బ్రేకులు పడ్డాయి. 8 నెలలుగా పనులు నిలిచి పోవడంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందా..లేదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై ఆధార పడిఉంది. రెండున్నరేళ్ల పాటు జరిగిన పనులు, బిల్లుల చెల్లింపులు, పురోగతిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకోవడం లేదనేది దీని ద్వారా స్ఫష్టమౌతుంది. దీనిపై అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కాంగ్రెస్ సర్కారు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు.
లక్ష్యం ఇదీ..
కరీంనగర్‌ను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎల్‌ఎండీ రిజర్వాయర్ దిగువన మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మించ తలపెట్టింది అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు. ఇరు వైపుల పార్కులు, వాటర్ ఫౌంటెన్లు, థీమ్ పార్కులు, వాటర్ స్ఫోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటెన్, గార్డెన్లు..12 నుంచి 13 అడుగుల లోతు వరకు మూడున్నర కిలోమీటర్ల వరకు వాటర్ బాడీ ఉండేలా ఏజెన్సీతో ప్లాన్ రూపొందించారు. ఇందులో స్పీడ్ బోట్లు, క్రూజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా,ఆహ్లాదాన్ని కలిగించేలా నిష్ణాతులైన ఇంజనీర్లతో ప్లాన్ వేయించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ కింద కరీంనగర్ మండలం చేగుర్తి, మానకొండూర్ మండలం లింగాపూర్ వరకు.. సెకండ్ ఫేజ్ కింద మానకొండూర్ మండలం వేగురుపల్లి వరకు సుందరీకరించేలా ప్రతిపాదించారు. రూ. 410 కోట్ల ప్రాజెక్టు పనుల్లో తొలుత రూ. 25 కోట్లు, ఆ తరువాత రూ. 100 కోట్లు మంజూరయ్యాయి. అయితే..2021లో పనులను ప్రారంభించి, 2023 ఆగస్టులో పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించాలన్నది అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం. కాని మధ్యలోనే నిలిచి పోయింది.
భవిష్యత్ ఏంటి ?
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచి పోవడంతో..పనులు ప్రారంభిస్తారా, లేక ఇలానే నిలిపి వేసి ఉంచుతారా..అన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు అయిన పనులు, గత ప్రభుత్వం చెల్లించిన బిల్లులు, పెండిరగ్ బిల్లులపై స్పష్టత లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సమీక్ష చేయలేదు. అయితే..ప్రభుత్వం మారగానే ఇరిగేషన్ కార్యాలయంలోని ఈ ప్రాజెక్టుకు చెందిన హార్ట్ డిస్క్‌లు మాయం కావడం అప్పట్లో చర్చకు తెర లేపింది. దీనిపై అప్పటి ఏసీపీ విచారణ కూడా చేశారు. దీన్ని ఎవరు చోరీ చేశారనేది ఇప్పటి వరకు స్ఫష్టత లేదు. మానేరు రివర్ ఫ్రంట్‌తో పాటు మరికొన్ని పనులూ పెండిరగ్‌లో ఉన్నాయి. గత బీఆర్‌ఎస్‌లో చేపట్టిన పనుల బిల్లులు రావడం లేదనే ఆరోపనలున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వీటిపై ఏ మేరకు చొరవ చూపుతారో వేచి చూడాలి.
ఆనందం.. ఆహ్లాదం..ఎప్పుడు ?

- Advertisment -