(N.S.Rao, వరంగల్)
తెలంగాణ కొత్త ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సముచిస్థానం లభించింది. గురువారం ప్రజా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇద్దరు క్యాబినెట్ మంత్రులను నియమించి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద వరంగల్ జిల్లాకు సమున్నత స్థానం కల్పించినారని ప్రజలు భావిస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ (సీతక్క)హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం pచేసిన కొండా సురేఖ, సీతక్క లు బాధ్యతలు చేపట్టారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ (సీతక్క) ములుగు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్కలకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు