జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు శనివారం మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కెసిఆర్ మాటలు హామీలు వట్టి మూటలే అని, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమే అని గ్రహించిన నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అభయ హస్తం అందించడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని విశ్వాసంతోనే కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారనిపేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండలం అధికార ప్రతినిధి జనగం శంకర్ బెజ్జంకి మండలం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చెప్పాల శ్రీనివాస్ గౌడ్, వడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు మంద శేఖర్ గౌడ్, పులి సంతోష్ గౌడ్ వడ్లూరు గ్రామం నుండి మెచ్చినేని మాధవరావు, గాదం స్వామి, రాసూరి మల్లికార్జున్, కొట్టే వీరేశం, కాసాని నరసయ్య, కాసాని కనకయ్య, ఎండి సాదిక్, బాబు మియా, వివిధ కులాలకు చెందిన వారుకాంగ్రెస్ పార్టీలో చేరికలలో ఉన్నారు. బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా అమరేందర్ రెడ్డి, సోమ రాంరెడ్డి , మామిడాల జయరాం, స్థానిక ఎంపీటీసీ పోతు రెడ్డి స్రవంతి మధుసూదన్ రెడ్డి,జెల్ల ప్రభాకర్, మానాల రవి, కత్తి రమేష్, శనగండ శరత్,శీలం నర్సయ్య, బుర్ర రవి,బుర్ర తిరుపతి గౌడ్, బర్ల శంకర్, తదితరులు పాల్గొన్నారు.