జనతా న్యూస్ బెజ్జంకి: శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు కళ్ళేపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను విశ్వసించి, ప్రజలు కాంగ్రెస్ అభయ హస్తం కోసం ఎదురు చూస్తున్నారని కవ్వంపెల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు , బెజ్జంకి మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ ధోనే వెంకటేశ్వరరావు, మానాల రవి, జెల్ల ప్రభాకర్ యాదవ్, శనగండ శ్రావణ్, శరత్, బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, యువ నాయకులు పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, శీలం నర్సయ్య, గుండ అమరేందర్ రెడ్డి, కోరుకొప్పుల సంపత్ గౌడ్, బుర్ర సుమన్ గౌడ్, బండి వేణు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
కవ్వంపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు
- Advertisment -