Thursday, September 19, 2024

జార్ఖండ్‌ రాంచి టూ కరీంనగర్‌..

మావోయిస్టును అరెస్టు చేసిన రూరల్‌ పోలీసులు
జిల్లా కోర్టులో భారీ పోలీసు బందోబస్తు
కరీంనగర్‌-జనత న్యూస్‌
మావోయిస్టు నేతను జార్ఖాండ్‌ లోని రాంచి జైలు నుండి కరీంనగర్‌ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. 2008లో కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో మావోయిస్టు నేత అమితాబ్‌ బాగ్చి అలియాస్‌ అమిత్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు పోలీసులు. జార్ఖాండ్‌ రాష్ట్రంలోని రాంచీ జైలులో ఉన్న ఆతన్ని..పిటీ వారెంట్‌ కింద కరీంనగర్‌ రూరల్‌ ఇన్స్పెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బృందం అదుపులోకి తీసుకుంది. అక్కడి నుండి కరీంనగర్‌ తీసుకొచ్చిన పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, జిల్లా కోర్టులో హాజరుపర్చారు. మావోయిస్టు నేత అమితాబ్‌ బాగ్చిని పోలీసులు కోర్టులో హాజరు పర్చగా..బెయిల్‌ లభించి బయట ఉన్న కోబాడ్‌ గాంధీ, వారణాసి సుబ్రహ్మణ్యం, బచ్చు ప్రసాద్‌ సింగ్‌ లు నేరుగా కోర్టుకు హాజరయ్యారు. అఖిలేష్‌ జాదవ్‌ జైల్లో ఉండగా అతన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేసు పూర్వోపరాలు..
2008లో ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర పన్నారని కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో క్రైమ్‌ నెంబర్‌ 1/2008 గా 32 మంది అప్పటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులపై కేసు నమోదు అయింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా మల్ల రాజిరెడ్డి తో పాటు ప్రమోద్‌ మిశ్రా, కోబాడ్‌ గాంధీ, జైస్పాల్‌ సింగ్‌, వారణాసి సుబ్రహ్మణ్యం , అమిత్‌ బాగ్చి, అఖిలేష్‌ జాదవ్‌, బచ్చు ప్రసాద్‌ సింగ్‌ లతో పాటు జెన్ను ముఖర్జీలు అరెస్టు అయి వివిధ జైలులో ఉన్నారు. 2009, 2010లలో వారిని పిటీ వారింట్‌పౖౖె తీసుకొని వచ్చి ఇక్కడి కోర్టులో హాజరు పరిచారు. అప్పటినుండి ఎవరు కోర్టుకు హాజరు కావడం లేదు. తాజాగా నేడు అమిత్‌ బాక్షి జార్ఖండ్ లోని రాంచి జైల్లో ఉండగా కోర్టు ఆదేశాలపై ఎస్కార్ట్‌ తో తీసుకొని వచ్చి హాజరు పరిచారు. బెయిల్‌ లభించి బయట ఉన్న కోబాడ్‌ గాంధీ, వారణాసి సుబ్రహ్మణ్యం, బచ్చు ప్రసాద్‌ సింగ్‌ లు నేరుగా కోర్టుకు హాజరయ్యారు. అఖిలేష్‌ జాదవ్‌ జైల్లో ఉండగా అతన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. ఈకేసును పైకోర్టుకు బదిలీ చేస్తుండగా ..పై కోర్టు నుండి సమన్‌ జారీ చేసినప్పుడు ఆయా కోర్టుకు వీరు హాజరు కావాల్సి ఉంటుంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page