Jayaprada : సినీ నటి జయప్రదకు తమిళనాడు హైకోర్టు షాక్ ఇచ్చింది. 15 రోజుల్లోకి కోర్టులో లొంగిపోవాలని, అలాగే రూ.20 లక్షల సొంత పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చెన్నైలో జయప్రద ఒక సినిమా థియేటర్ ను రన్ చేసేవారు ఇందులో పనిచేసే ఉద్యోగులు తమకు ఈఎస్ ఐ చెల్లించలేదని కోర్టుకెక్కారు. ఈ కేసులో జయప్రదతో పాటు మరో ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు శిక్ష రద్దు చేయాలని జయప్రద కోర్టును ఆశ్రయించారు.తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో నటించిన జయప్రద స్టార్ నటిగా కొనసాగారు. ఆ తరువాత సైడ్ పాత్రల్లో నటించి మెప్పించారు.
Jayaprada : కోర్టులో లొంగిపోవాలని జయప్రదకు ఆదేశాలు
- Advertisment -