విస్మయం కల్గిస్తున్న హైడ్రా తీరు..
రుణమాఫీపై సర్వే పెద్ద జోక్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపనలు
సిరిసిల్ల-జనత న్యూస్
మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫాంహౌజ్ ను ఎందుకు కూల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ . సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఆయన..మీడియాతో మాట్లాడారు. అక్రమంగా నిర్మించిన ఒవైసీ విద్యా సంస్థలకు నోటీసులెందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. చెరువులు, కుంటలను, సర్కార్ స్థలాలను కబ్జా చేసి, ఫాంహౌజ్ లు, విల్లాలు కడితే కూల్చివేయాల్సిందే నన్నారు. కానీ ఒకరిద్దరి పెద్దల భవనాలను కూల్చి… మిగిలిన పేదల ఇండ్లను కూల్చేస్తాననడం సరికాదన్నారు. హైడ్రా తీరు విస్మయం కలిగిస్తోందన్నారు. నేత కార్మికుల విద్యుత్ సబ్సిడీ విషయంలో గత బీఆర్ఎస్తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందన్నారు. 50 శాతం ఇస్తానన్న సబ్సిడీ ఏమైందని ప్రశ్నించారు. ఆరోపనలు పక్కన బెట్టి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎంకు సూచించారు కేంద్ర మంత్రి సంజయ్. రుణమాఫీపై సర్వే చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటని, ఈ డబ్బులన్నీ కర్నాటక మహర్షి వాల్మీకీ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ కు మళ్లించారా..అని ప్రశ్నించారు. రైతులకు అప్పు మాఫీ కాక, భరోసా అందక, పంట నష్ట పరిహారం అందక అల్లాడుతుంటే ..సర్వే పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. తాను కోర్టును ధిక్కరించేలా ఎన్నడూ మాట్లాడలేదని, కవిత తరపున బెయిల్ ఇప్పించేందుకు కాంగ్రెస్ నేత వాదించారని చెప్పినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు సింగపూర్ నుండి అమెరికా వెళ్లి… అక్కడ బీఆర్ఎస్ నేతలతో విలీనంపై చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలిసిందన్నారు. సిరిసిల్ల విలీన గ్రామాల ప్రజల డిమాండ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతిస్తొందని, వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాల్సిందే నన్నారు.
జన్వాడ ఫాంహౌజ్ ను ఎందుకు కూల్చడం లేదు?
- Advertisment -