మంచిర్యాల, జనతా న్యూస్: వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మంచిర్యాల జిల్లా గవర్నర్ గా జంధ్యం మాధవి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రస్తుత గవర్నర్ వాసవీయన్ ప్రొగ్రెసివ్ గోల్డెన్ స్టార్ కొండ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆమె మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి వాసవీయన్ కేసీజీఎఫ్ బాల సంతోష్ మాట్లాడుతూ జిల్లా గవర్నర్ పదవికి ఒకటే నామినేషన్ వచ్చిందన్నారు. దీంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జంధ్యం మాధవి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని క్లబ్ లను ఏకం చేసి వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 2005లో కరీంనగర్ లో వాసవీ క్లబ్ ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలుగా ఈ క్లబ్ నుంచి వివిధ హోదాల్లోని వ్యక్తులు సమాజానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలోని ఐఈసీ, ఐజీబీ ఆఫీసర్లు, క్యాబినెట్ ఆఫీసర్లు, పబ్బా అరుణ, ఎల్లెంకి ప్రదీప్, జైన అర్బనీ, సూర గీత, రాచమళ్ల గాయత్రి, అల్లెంకి లింగమూర్తి, రజిత, యాంసాని రమాదేవి, డాక్టర్ ఎలగందుల సౌమ్య, అక్కెనపల్లి నాగరాజు, ఐత రమాదేవి, జిల్లా ణుగోపాల్, బొడ్ల సంతోష్, ఎలగందుల అరుణ, వాసవీయన్లు తదితరులు పాల్గొన్నారు.