- శ్రీధర్ బాబుకు బ్రహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు
- మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా
మంథని, జనతా న్యూస్: మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ప్రజలు పల్లె పల్లెనా బ్రహ్మరథం పడుతున్నారు. ఉన్నత విద్యావంతుడిగా, సౌమ్యుడిగా, జననేత గా కీర్తి గడించిన దుద్దిళ్ల కు జనం నీరాజనాలు పడుతున్నారు. జేఎన్టీయూ ఐటిఐ పాలిటెక్నిక్ నిరుద్యోగులకు శిక్షణ తరగతులు నియోజకవర్గంలో విద్యా రంగానికి పెద్ద పీట వేసిన ఘనత శ్రీధర్ బాబు దని ప్రజలు విద్యావేత్తలు కొనియాడుతున్నారు. తన ప్రతిభా పాటవాలతో స్వయంకృషితో ఏఐసీసీ కార్యదర్శిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గా ఎదిగిన జాతీయ నేతగా హారతులు అందుకుంటున్నారు.తన తండ్రి స్వర్గీయ ధుద్దిల్ల శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తున్న నిత్య కృషి వలునిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారు. తన తండ్రి అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు తన అభిమానులు కాంగ్రెస్ కు పెట్టని కోట గోడలా నిలుస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు నిత్యం నియోజకవర్గ అభివృద్ధిని ప్రార్థిస్తూ ప్రజల విశ్వాసాన్ని ప్రజల పరుచుకుంటూ పేదల పక్షపాతిగా అభిమానం చూరగొంటున్నారు.
మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆరవసారి పోటీ చేస్తూ విజయ తీరాల వైపు ప్రయాణిస్తున్నారు. ఎందరు పోటీలో ఉన్న ఆజాతశత్రువుగా ముందుకు సాగిపోతున్నారు. కాంగ్రెస్ రైతు మహిళా బీసీ మైనారిటీ డిక్లరేషన్లు రాహుల్ గాంధీ విజయభేరి యాత్ర మంథని కాంగ్రెస్ పార్టీ లీడర్ లో జోష్ నింపాయి. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు శ్రీధర్ బాబుకు గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. ఇదే ఊపును కొనసాగించడానికి అర్ధరాత్రి దాటి తెల్లవారుజాము మూడు గంటల వరకు ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. శ్రీధర్ బాబు విజన్ ఉన్న నాయకుడని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రజలు నమ్ముతున్నారు. పాలకుర్తి నుంచి పలిమెల వరకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల గురించి మహిళా ఓటర్లు చర్చించుకుంటున్నారు కొత్త ఓటర్లుగా నమోదైన యువత కాంగ్రెస్ పార్టీ తమకు న్యాయం చేస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. తూర్పు మండలాల్లో కాంగ్రెస్ కంచుకోట చెక్కుచెదరకుండా ఉందని ఎందరు వచ్చిన బద్దలు కొట్టలేరనే ధీమాతో శ్రీధర్ బాబు ఉన్నారు.