జనతా న్యూస్ బెజ్జంకి : ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంక్షేమ పథకాలు అందిస్తుందని రిటైర్డ్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మరళి అన్నారు. ఓటరు చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆయన బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన ‘జాగో( మేలుకో) తెలంగాణ”( టి ఎస్ డి ఎఫ్ ) కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక చైర్మన్ అయిన ఆకునూరి మురళి మండల కేంద్రంలో స్థానిక ప్రజలను,యువకులను ఉద్దేశించి ఓటు ప్రాముఖ్యత తెలియజేస్తూ మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అక్రమాలు చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కమీషన్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని అన్నారు. ఓటు వేసేటప్పుడు ఆచితూచి వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి( టీఎస్ డి ఎఫ్ ) కన్వీనర్, నైనాల గోవర్ధన్ సమన్వయకర్త, ప్రొఫెసర్ పద్మజ, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ప్రజాస్వామ్య వేదిక నాయకులు రవికుమార్, అంజయ్య, మార్వాడి సుదర్శన్, కృష్ణారావు, సత్తార్ ఖాన్, శ్రీకాంత్, రైతు కూలీ సంఘం నాయకులు బామల్ల రవీందర్, స్వేరో నాయకులు బొర్ర సురేష్ కుమార్, ఉప్పులేటి బాబు, బీఎస్పీ నాయకులు ఉప్పులేటి శ్రీనివాస్, బెజ్జంకి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో ‘జాగో తెలంగాణ’
- Advertisment -