సంగారెడ్డి, జనతా న్యూస్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ తరుణంలో పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పటిలాగే హాట్ కామెంట్స్ చేసి ప్రత్యేకంగా నిలిచారు. విజయదశమి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని అన్నారు. పండుగ సందర్భంగా తన మనసులోని మాట చెప్పానని అన్నారు. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకునేవాడినని, అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున ఏం మాట్లాడలేకపోతున్నానని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మొన్నటి వరకు సీనియారిటీ వర్సెస్ జూనియర్ వార్ కొనసాగింది. అయితే ఎన్నికల సందర్భంగా అందరూ ఒక్కతాటిపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేయడంపై పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీఎం పదవిపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
- Advertisment -