వైఎస్‌ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం రద్దు నిర్ణయం వెనుక మతలబేంటి..? టీటీడీ అధికారులకు డిక్లరేషన్ ఇవ్వక పోవడానికి కారణం..? వీటిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైనార్టీల పట్ల ఏపీ ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని ఇలా చెప్పకనే చెప్పినట్లుగా అర్థమౌతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ వివాదం రెండు రోజులుగా కొనసాగాక, చివరికి తన అభిప్రాయాన్ని స్ఫష్టం చేశారు జగన్. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న ఆయన తాడెపల్లిలో మీడియాతో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడిరచారు. తన మతం మానవత్వమని, తాను అన్ని మతాలను, ఆయా గ్రంథాలను చదువుతానని స్ఫష్టం చేశారు. సీఎంగా ఐదేళ్లు బ్రహ్మోత్సవాలకు వెళ్లానని, ఇప్పుడు డిక్లరేషన్ అడగడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి బీజేపీ నేతలను ఓపెన్‌గా విమర్శించారు. ఆ పార్టీ నాయకత్వంపై ఆరోపనలు చేయకుండానే పరోక్షంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్ర నేతలపై విమర్శలు చేశారు జగన్. జగన్ తీసుకున్న నిర్ణయం, చేసిన ఆరోపనల వల్ల ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం డైలామాలో పడిరదా..? లేక దర్శనం చేసుకోకుండా పరోక్షంగా ఇలా అడ్డుకుని సక్సెస్ అయిందా..? అనేది సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే..తిరుమల శ్రీవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా..? కొందరు అనేక సార్లు దర్శనం కోసం వెళ్తుంటారు..? వెళ్లిన ప్రతీ సారి టీటీడీ అధికారులకు డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాలనే రూల్ ఉందా..? ఇలా అనేక సందేహాలకు టీటీడి సమాదానాలు రావాల్సి ఉంది.
జగన్ శ్రీవారి దర్శనం రద్దు వెనుక మతలబు..

- Advertisment -