Friday, September 12, 2025

కల్తీ రహిత విత్తనాల జిల్లాగా తీర్చిదిద్దాలి

  • అధికారుల సమీక్ష సమావేశంలో సీపీ అనురాధ హెచ్చరిక
  • రాబోయే 30 రోజులు చాలా కీలకమని సూచన
  • పోలీస్,అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి
  • మధ్యవర్తుల ముసుగులో కల్తీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
  • నకిలీ విత్తనాల విక్రయాలలో తరచూ కేసులు నమోదైతే పీడీ యాక్ట్ అమలు
  • అక్రమ రవాణా నియంత్రించేందుకు జిల్లా సరిహద్దులో పటిష్ట నిఘా
  • నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయాలని చూస్తే సహించేదిలేదు
  • నకిలీ విత్తనాలలో ఎంతటి వారున్నా వదిలిపెట్టం*

సిద్దిపేట,జనత న్యూస్:జిల్లాను కల్తీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సీపీ అనురాధ అయా విభాగాల పోలీస్ అధికారులకు హెచ్చరించారు.మంగళవారం కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధ సిద్దిపేట టాస్క్ ఫోర్స్,పోలీస్ స్టేషన్ల అధికారులు,స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడారు.నకిలీ విత్తనాలు,పురుగుల మందులను అరికట్టడానికి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ అధికారి,సబ్ ఇన్స్పెక్టర్ ఇరువురు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.ప్రతి గ్రామం నుండి నకిలీ విత్తనాలు,పురుగుల మందుల పై ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా రైతులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు.గత మూడు సంవత్సరాలుగా నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని దళారుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నిందితులను బైండోవర్ చేయాలని సూచించారు.నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా అమ్మిన వ్యక్తుల పై పీడీ యాక్ట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపిసమని జరు తెలిపారు.జిల్లాలో ఏ ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత వ్యవసాయ,పోలీసు అధికారులదని సూచించారు. రాబోయే 30 రోజులు చాలా కీలకమని ట్రాన్స్ పోర్ట్, ఫర్టిలైజర్ షాప్,సీడ్స్ షాప్స్ పై నిఘా పెట్టి పాత నేరస్తుల యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులకు సూచించారు.మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు,సిబ్బంది పోలీస్ అధికారులు సిబ్బంది ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ప్రతి విషయం షేర్ చేసుకుని సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.షాప్ పేరు లేకుండా విత్తనాలు అమ్మే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.గ్రామాలలో తిరుగుతూ విడి విత్తనాలు అమ్ముతున్నరని ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు.సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని సూచించారు.విత్తనాలు,పురుగుల మందుల గోదాములు ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి అవగాహన ఉండాలని గోదాముల పై నిఘా ఉంచాలని సూచించారు.రాష్ట్రస్థాయిలో టాస్క్ ఫోర్స్, ఇంటలిజెన్స్ టీమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు జిల్లాలో ఉండకుండా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.వీపీఓ సంబంధిత గ్రామ రైతులతో మాట్లాడి నకిలీ విత్తనాలు గురించి ఆరా తీయాలని సూచించారు.వ్యవసాయ,పోలీసు అధికారులు కలిసి సమన్వయంతో విధులు నిర్వహించి నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు జిల్లాలో లేకుండా రూపుమాపాలని సూచించారు.ఎవరైనా నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్నారని సమాచారం ఉంటే డయల్ 100,సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని సీపీ సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ యస్.మల్లారెడ్డి,టాస్క్ ఫోర్స్ అధికారులు,స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది,ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page