ఒక ఆవు ఎదురుగా వస్తే ఎవరైనా భయపడుతారు. అదే ఆవు తొక్కితే ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ కొందరు నేలపై పడుకొని మరీ గోవులతో తొక్కించుకుంటారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలోని బిధావత్ తో పాటు బద్ నగర్ లో ఓ సంప్రాదాయం ఉంది. దీపావళి సందర్భంగా వీరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా బిదావత్ గ్రామస్థులంతా డప్పు చప్పుళ్లతో ఒకే చోటకు వస్తారు. ఆ తరువాత ఊళ్లోని ఆవులన్నింటికి ఒక చోటకు తీసుకువస్తారు. ఆ తరువాత వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలు పూర్తయిన తరువాత పురుషలంతా నేలపై వరుసగా పడుకుంటారు. వారిని తొక్కుకుంటూ ఆవులు ముందుకు వెళ్తాయి. ఇలా చేస్తే అదృష్టం వస్తుందని, కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతున్నారు. ఈ సాంప్రదాయం చాలా ఏళ్లుగా సాగుతుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. తాజాగా దీపావళికి జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ ఆవులతో తొక్కించుకోవడం సాంప్రదాయం..
- Advertisment -