అమరావతి: ఇజ్రాయెల్ -హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే వేల మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్ కు సపోర్టు చేస్తున్నారు. భారత్ కూడా ఇజ్రాయెల్ తరుపున మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం ఆగిపోవాలని ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాల్లో వేడుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో కొందరు ఇజ్రాయెల్ లో యుద్ధం ఆగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ప్రత్యేక పూజలు చేశారు. తామంతా యూదులమని ఎన్నో ఏల్ల కిందటే తమ పూర్వీకులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని స్థానికులు అంటున్నారు. వీరు హిబ్రూ బాష మాట్లాడుతారు. అంతేకాకుండా వీరు యూదు సాంప్రదాయ పద్ధతుల్లోనే ప్రార్థనలు చేశారు.
ఇజ్రయెల్-హమాస్ యుద్ధం.. ఏపీలో ప్రత్యేక ప్రార్థనలు
- Advertisment -