కరీంనగర్, జనతా న్యూస్: తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. . కాటారం మండలం దామెరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్ (20) జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్ లో ఉంటున్న అభిలాష్ ఈ నెల ఒకటో తేదీన రాత్రి కళాశాల నుండి బయటకు వెళ్లినాడని, అప్పటి నుండి కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఆచూకీ కోసం ఎక్కడా వెతికినా దొరకడం లేదని, అభిలాష్ హాస్టల్ నుండి వెళ్లినపుడు నల్ల టీ షర్టు, నల్ల ప్యాంటు ధరించినట్లు, ఎరుపు రంగు గల అతను 5.2 ఫీట్ల ఎత్తు ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో అభిలాష్ తండ్రి ఎనగంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడా వెతికినా దొరకడం లేదని, ఎవరికైనా ఆచూకీ లభిస్తే, ఎల్ఎండీ ఎస్సై ఫోన్ 8712670770, తండ్రి శ్రీనివాస్ 8019786229 నంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం
- Advertisment -