IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ ఎక్కడ ఉంటుందన్న ఆసక్తి క్రీడాభిమానాల్లో నెలకొంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా బీసీసీఐ తొలి 21 మ్యాచ్ లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. తాజాగా పూర్తి షెడ్యూల్ ను రెడీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఓ బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మాదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక క్వాలిఫైయర్, ఎలిమినేట్ మ్యాచ్ లు ఉంటాయని, మరో క్వాలిఫైయర్ చెన్నైలో జరగనుందని తెలిపారు. త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజస్థాన్ రాయల్స్ లక్నో మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటిల్స్ తలపడనున్నాయి.
IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్కడే..
- Advertisment -