ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం తాడేపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం, సెకండ్ ఇయర్ లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లాలు ఉన్నాయి. సెకండ్ ఇయర్ లో 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాలను bieap.apcfss.inవెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించడం వివేషం .ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులు మొత్తం 10,52,221 మంది ఉన్నారు. ఇందులో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు. ఒకేషనల్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు లక్ష వరకు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో.. మూల్యాంకన ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. ఏప్రిల్ 4లోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేలా బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
ఇంటర్ ఫలితాలు: ఈ జిల్లా మొదటి స్థానం..
- Advertisment -