Inter Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈనెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈనెల 30 లేదా మే 1న విడుదల చేాయాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. మొదటి, రెండు సంవత్సరాలు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10వ తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టి ఈనెల 10వ తేదీన పూర్తి చేశారు. మార్కుల నమోదు పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతోపాటు కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. 2
Inter Results 2024: 24న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు
- Advertisment -
