తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1521 పరీక్షా కేంద్రాల్లో 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ 4,78,718 మంది విద్యార్థులు ఉండగా.. సెకండ్ ఇయర్ 5, 02, 260 మంది పరీక్ష రాయనున్నారు. రెండో సంవత్సరంలో ప్రైవేట్ గా రాసేవారు 58,071 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 407 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 407 ప్రభుత్వ ఆధీనంలో ఉండే కళాశాలలు, 880 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
Inter Exam: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
- Advertisment -