Instagram : టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత చాలా మంది ఇన్ స్ట్రాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. డ్యాన్స్, ఆర్ట్స్ ఇలా కళ ఉన్నవారు తమ ప్రతిభను చూపుతూ వీడియోలు చేసిన వారు ఇన్ స్ట్రాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేసి ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. రోజురోజుకు ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాదారులు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ కొత్త కొత్త ఫీచర్సను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇన్ స్ట్రాగ్రామ్ ఫాలోవర్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. ప్రతీ ఖాతాదారుడు విభిన్న విడియోను అప్లోడ్ చేస్తూ వ్యూయర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇన్ స్ట్రాగ్రామ్ వినియోగదారులను పోస్టుల వ్యాఖ్యల విభాగంలో పోల్ లను రూపొందించడానికి అనుమతించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇన్ స్ట్రాగ్రామ్ హెడ్ అడమ్ మెస్సేరి ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈఫీచర్అందుబాటులోకి వస్తే సాధారణ ఫీడ్ పోస్టులు, రీల్స్ రెండింటిలోనూ వ్యాఖ్యలకు పోల్స్ ను జోడించవచ్చు. ఇది ప్రస్తుతం పీరక్ష దశలో ఉంది. త్వరలోని అందుబాటులోకి తీసుకురానున్నారు.