- యువతకు యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్
( మానకొండూరు నియోజకవర్గం ప్రత్యేక ప్రతినిధి జనతా న్యూస్) గత పదిహేనేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అంటూ కాలయాపన చేసి యువతకు మొండి చేయి చూపారని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఆయన ఆదివారం రాత్రి మానకొండూరు నియోజకవర్గం లోని బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికైనా యువత ఆలోచించాలని యువతకు ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ వల్ల ఏ సాధ్యమని, అందుకే మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే పేపర్లు లీకులు చేసి యువత ఆత్మహత్యలు చేసుకునేలా చూస్తున్నారని ఇటీవల ప్రవళిక ఆత్మహత్యయే అందుకు ఉదాహరణయని, ప్రవళిక అసలు గ్రూప్ పరీక్షయే రాయలేదని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో యువశక్తి నారిశక్తి చూస్తే గర్వంగా ఉందని టిపిసిసి అధికార ప్రతినిధి కాల్వ సుజాత స్పష్టం చేశారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం రైతు భరోసా గృహజ్యోతి రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ పథకం యువ వికాసం ద్వారా ఐదు లక్షల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుందని ఆమె తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతానని ఆ హామీని తాను తప్పకుండా నెరవేరుస్తానని, మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన స్థానికేతర ఎమ్మెల్యే రసమయిని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు పలువురు మహిళలు మంగళహారతులతో పోతరాజు వేషధారణలతో ముదిరాజులు చేపలవలతో యాదవులు మేకల బండితో పీరీలు డప్పు చప్పులతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో డాక్టర్ కవ్వంపల్లి అనురాధ ఒగ్గు దామోదర్ రత్నాకర్ రెడ్డి, ఐలైన శ్రీనివాస్ రెడ్డి , అక్కరవేని పోచయ్య రావుల నరసయ్య , పులికృష్ణ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మానాల తిరుమల రవి, డివి రావు కత్తి రమేష్, జెల్ల ప్రభాకర్, బండి పెళ్లి రాజు జేరిపోతుల మధు వినయ్ బొనుగం రాజేశం బండి వేణు లింగాల శ్రీనివాస్ సిపిఐ నాయకులు మహేందర్ రూపేష్ తదితరులు ఉన్నారు.