పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించిన కలెక్టర్
కరీంనగర్-జనత న్యూస్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్డీవో , ఇతర అధికారులతో కలసి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ, స్టాళ్ల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం వందన స్వీకరణ, ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధులకు సన్మాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల అందజేత, వివిధ స్టాళ్ల పరిశీలన ఉంటుందన్నారు. చివరగా ఉదయం 11:30 నిమిషాలకు పోలీస్ ఆడిటోరియంలో తేనీటి విందు నిర్వహించనున్నట్లు తెలిపారు.