IND Vs PAK :ప్రపంచంలోనే హై వోల్టేజ్ మ్యాచ్.. భారత్ వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ శనివారం అహ్మదాబాద్ లో జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీం ఇండియా బౌలింగ్ ు ఎంచుకుంది. టీమిండియా రథ సారధి వరసగా రెండు విజయాలతో దూకుడుమీదున్నాడు. హ్యాట్రిక్ పై కనన్నేశాడు. వరల్డ్ కప్ లో భారత్, పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ అంటే ఎవరికైనా ఉత్కంఠ ఉంటుంది. నువ్వా నేనా? అన్న రీతిలో పోటా పోటీ ఉంటుది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై గంపెడాశలు ఉన్నాయి. 2019లో జరిగిన ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ 140 స్కోరు చేశాడు. కోహ్లీ 77 పరుగులు చేశాడు. ఆ సమయంలో భారత్ 336 స్కోరు చేసింది. అయితే వర్షం కారణంగా అంతరాయం కలగడంతో మొత్తానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు రెండు జట్ల మధ్య పోటా పోటీ నెలకడంతో ఏ జట్టు గెలుస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
IND Vs PAK : టాస్ గెలిచిన భారత్.. రోహిత్ పై గంపెడాశలు..
- Advertisment -