IND VS ENG : ఇంగ్లండ్ తో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్ లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లకు దూరమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. రవీంద్ర జడేజా సైతం గాయం కారణంగా టెస్ట్ మ్యాచ్ లను ఆడడం లేదు. అయితే కేఎస్ రాహుల్ కు అవకాశం ఇచ్చారు. మరో వైపు రాయల్ ఛాలెంజర్స్, బెంగుళూరు పేసర్ ఆకాష్ దీప్ కు అవకాశం వచ్చింది. యువ బ్యాటర్లు ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలను నిలుపుకున్నారు.
మూడు టెస్టుల్లో ఆడేది వీరే..
రోహిత్ శర్మ(కెప్టెన్), జప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మోహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఉన్నారు..