IND Vs ENG : రాంచీ వేదికగా సాగించి భారత్, ఇంగ్లండ్ 4వ టెస్ట్ లో విజయం భారత్ వశం అయింది. దీంతో ఈ సిరీస్ ఇండియా ఖాతాలో పండింది. బ్యాటింగ్ లో కష్టాలు ఎదుర్కొన్న టీమిండియా మొత్తానికి లక్ష్యాన్ని ఛేదించారు. 192 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయినా అవోక విజయం సాధించారు. ఇందులో రోహిత్ శర్మ 55, శుభ్ మన్ గిల్ 52 (నాటౌట్), యశస్వి జైశ్వాల్ 37, ధ్రువ్ జురెల్ 39(నాటౌట్)పరుగులు చేసి భారత్ ను గెలిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, టామ్ హర్ట్ లీ, జోరూట్ చెరో వికెట్ తీసుకున్నారు. చివరి రోజు టెస్టులో 40 పరుగులతో భారత్ అజేయంగా నిలిచింది. రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ స్కోరును పెంచారు. సోయబ్ బషీర్ ఒకే ఓవర్ లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ను ఔట్ చేశాడు. ఈ సమయంలో మరో వికెట్ పడితే పరిస్థితి వేరే ఉండేది. కానీ పకడ్బందీ వ్యూహంతో ఆడి మన బ్యాటర్లు భారత్ ను గెలిపించారు. మొత్తంగా ఇంగ్లండ్ తోలి ఇన్నింగ్స్ లో 353, రెండో ఇన్నింగ్స్ లో 145 చేసినా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 307, రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులతో విజయం సాధించారు.
IND Vs ENG : 4వ టెస్టులో భారత్ విజయం.. సిరీస్ భారత్ వశం..
- Advertisment -