IND Vs ENG: రాంచీ వేదికగా ఇంగ్లండ్ తో జరగుతున్న టెస్ట్ లో భాగంగా భారత్ రెండో రోజూ టీ బ్రేక్ వరకు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఇందులో సర్ఫరాజ్ అహ్మద్(1) , జైస్వాల్ (54)లో క్రీజ్ లో ఉన్నారు. లక్ష్యం చేరాలంటే భారత్ 222 పరుగులు చేయాల్సి ఉంది. మరో నాలుగు వికెట్లు మాత్రమే మిగిలి ఉండడంతో అనుకున్న స్కోరు పూర్తి చేస్తుందా? లేదా? అనేది ఆందోళనగా మారింది. 34 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన తరువాత భారత బ్యాటర్ జైస్వాల్ నెమ్మదిగా ఆడారు. ఆ తరువాత గిల్ బౌండరీలు కొట్టి సపోర్టు ఇచ్చాడు. కానీ ఇదే సయంలో ఇంగ్లండ్ స్పిన్నర్ సోయబ్ బషీర్ భారత్ వికెట్లపై దాడి చేసి గిల్, పటీదార్, జడేజాలను ఔట్ చేశాడు. ఒక దశలో ఒక వికెట్ కోల్పోయినా 112 పరుగులు రావడంతో కాస్త ఆశలు వచ్చాయి. కానీ 130 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ జైశ్వాసల్ హాప్ సెంచరీతో పర్వలేదనిపించాడు.
IND Vs ENG: రాంచీ టెస్ట్ పై ఆందోళన..
- Advertisment -