మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్:తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం( ప్రజా భవన్) ను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు.ప్రజలు ,అధికారులు, కార్యకర్తలు నేటి నుండి ప్రజా భవన్ లో నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే 2 గ్యారంటీలను ఆమలు చేసామని తెలిపారు. మిగిలిన 4 గ్యారంటీలను కూడా త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వేదమూర్తులైన బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన సతీమణి డాక్టర్ అనురాధ తో కలిసి చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యే గారికి ఆశీర్వ చనాలు అందజేశారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మానకొండూర్ నియోజకవర్గం పరిధిని వివిధ మండలాలకు చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయ మొత్తాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. నియోజకవర్గానికి చెందిన రజిత,అమరం మంగ, మామిడిపల్లి రజిత, నెల్లు భాగ్యలక్ష్మి, కాల్వ రాధ, గడ్డం శోభ, పెరగొండ అంజమ్మ, నాంపల్లి కనకమ్మలకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో *బెజ్జంకి* మండలానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు ముక్కీస రత్నాకర్ రెడ్డి, పులి కృష్ణ, అక్కరవేణి పోచయ్య, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, రావుల నర్సయ్య, మహంకాళి ప్రవీణ్, రాసూరి మల్లికార్జున్, కత్తి రమేష్, మానాల రవి, డివి రావు, మిట్టపల్లి చెన్నారెడ్డి, చిలివేరు శ్రీనివాస రెడ్డీ, పర్శ సంతోష్, *ఇల్లంతకుంట* మండలానికి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బి రాఘవరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మల్లయ్య, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతగిరి వినయ్ కుమార్, సంతోష్, ఎండి జమీల్ *తిమ్మాపూర్* మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము,నాయకులు ధన్నమనేని సురేందర్ రావు, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల సంపత్ రెడ్డి, నుస్తులాపూర్ ఎంపిటిసి కొత్త తిరుపతిరెడ్డి, లక్ష్మణ్, మార్క నర్సయ్య, జినుక మారుతి, సంపత్, చిట్టి బాబు నియోజకవర్గం లోని పెక్కు మంది తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
