తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో చిరుత దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. మార్చి 25, 26 తేదీల్లో పారెస్ట్ లో అమర్చిన ట్రాప్ కెమెరాకు చిరుత దృశ్యాలు చిక్కాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించి టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రస్తుతం అలిపిరి మార్గంలో రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా అనుమతిస్తున్నారు. వీరికి కర్రలు ఇస్తూ సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను కొండపైకి పంపుతున్నారు. రాత్రి సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు
- Advertisment -