ప్రపంచ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కుటుంబంలో వినాయక చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. దక్షిణ ముంబైలోని యాంటిలియా నివాసంలో నూతన వధూవరులు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ దంపతులు ఆకర్శనగా నిలిచారు. వివాహం తరువాత జరుపుతున్న తొలి గణేశ్ చతుర్థి కావడంతో..కుటుంబ సభ్యులు మొత్తం సంతోషంతో భక్తి భావంలో ముగిని తేలారు. రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ, సతీమణి నీతా అంబాని..ఇలా కుటుంబ సభ్యులు మొత్తం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. కాగా..ముంబైలోని లాల్‌బాగ్ రాజా( గణేషుడు) దేశ వ్యాప్తంగా ఫేమస్. ఇక్కడి మండపంలోని ప్రతిమకు ముకేశ్ అంబాని కుటుంబం 20 కిలోల బంగారు కిరీటాన్ని బహుకరించిందట.