Wednesday, September 18, 2024

వచ్చే ఎన్నికల్లో ‘రాహుల్‌-క్విట్‌ ఇండియా’ నినాదం

కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌
విదేశీ గడ్డపై భారత్‌ పరవు తీశారని ఆగ్రహం
హైదరాబాద్‌ :
వచ్చే ఎన్నికల్లో ‘రాహుల్‌`క్విట్‌ ఇండియా’ నినాదంతో ముందు కెళ్తామని సంఛలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఎస్సార్‌ కన్వెన్షన్‌ హాలులో రంగారెడ్డి అర్బన్‌ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కూన రవి కుమార్‌ లతో కలసి హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో పర్యటిస్తూ భారత్‌ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్‌ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పిన బండి సంజయ్‌… అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి జీహెచ్‌ఎంసీపై కాషాయ జెండాను ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రేవంత్‌ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్‌ కుటుంబాన్ని జైల్లో వేస్తడనుకున్నానని.. కానీ రేవంత్‌ తో సాధ్యం కావడం లేదన్నారు. కేసీఆర్‌ ఢల్లీి పోయి కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిడాని… అందుకే కేసీఆర్‌ కుటుంబం జోలికి రేవంత్‌ రెడ్డి వెళ్లడం లేదని ఆరోపించారు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ కుటుంబం అంతు చూసేటోళ్లమన్నారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని, అంతకుముందు జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజా వ్యతిరేక మూటకట్టుకున్న పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే నని, 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తిసిందని ఆరోపించారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ, పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ, అంబేద్కర్‌ స్పూర్తితో బీజేపీ ముందుకుపోతూ ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్నామన్నారు. విదేశీ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ దేశంలోని రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘంపై నమ్మకం లేని రాహుల్‌ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page