20 ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలు
రూ. 2.20 కోట్లతో లైటింగ్ తదితర సౌకర్యాలు
పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే, మేయర్ పరిశీలన
కరీంనగర్-జనత న్యూస్
సద్దుల బతుకమ్మ పండగకు నగర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశామని కరీంనగర్ శాసన సభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతికగా నిలిచే బతుకమ్మ పండగ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్, పలువురు కార్పోరేటర్లతో కలిసి సద్దుల బతుకమ్మ పండగ ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని మానేరు డ్యాం పరివాహాక ప్రాంతంలో గల రామచంద్రాపుర్ కాలనీ, గౌతమీ నగర్, శ్రీనగర్ కాలనీ, సప్తగిరి కాలనీ, మార్కండేయ కాలనీ నిమజ్జనం పాయిట్లను సంధర్శించి సద్దుల బతుకమ్మ పండగ ఏర్పట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే , మేయర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం పాయిట్ల వద్ద మహిళలకు ఇబ్బంది కలగకుండ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో దాదాపు రూ. 2.20 లక్షలతో 20 నిమజ్జనం పాయిట్లు, డివిజన్ లలో బతుకమ్మ పాయిట్ల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. నగరపాలక సంస్థ పరిదిలో గల మానేరు వాగు, కిసాన్ నగర్ గార్లకుంట, చింతకుంట, వేధాభవన్, మానేరు డ్యాం పరివాహాక ప్రాంతంలోని గౌతమీనగర్, రామచంద్రాప్షుర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, మార్కండేయ నగర్, సప్తగిర కాలనీ, మానకొండూర్, కొత్తపల్లి, అల్గునూర్, సధాశివ్ పల్లి, పద్మనగర్ రేకుర్తి వెంకటమ్మ చెరువు, సీతారాంపూర్ సాయిబాబా టెంపుల్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. గుంటురు నుండి తెప్పించిన చక్కటి లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహిళలు కుటుంబ సమేతంగా సద్దుల బతుకమ్మ వేడుకను సంతోషంగా జరురుకోవాలని పిలుపు నిచ్చారు. నగరంలోని మహిలలందరికీ సద్దుల బతుకమ్మ, దసర శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కార్పోరేటర్లు చొప్పరి జయశ్రీ, దిండిగాల మహేష్, మాజీ కార్పోరేటర్ ఏ. వీ రమణ, ఎస్ ఈ రాజ్ కుమార్, డీఈ ఓం ప్రకాష్, గట్టుస్వామి పాల్గొన్నారు.
నగరంలో బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు

- Advertisment -