పీపీలతో సిపీ అభిషేక్ మహంతి సమావేశం
కరీంనగర్-జనత న్యూస్
కోర్టుల్లో నింధులకు శిక్ష పడే సందర్భంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమన్నారు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి. నగరంలోని పోలీసు కమిషనరేట్ లో పోలీసులు, ఆయా కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి మాట్లాడుతూ.. నిందితులకు శిక్షపడుటలో పోలీసులతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకపాత్ర పోషిస్తారన్నారు. వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణ, కోర్టులో వచ్చే ట్రయల్, క్రైమ్ డీటెయిల్ ఫారం, ఛార్జ్ షీట్ లలో దొర్లే పొరపాట్లను సరిచేస్తూ సదరు పోలీస్ అధికారులకు సూచన చేస్తుంటారని తెలిపారు. పోలీసు అధికారులు సాక్షులను సరైన పద్దతిలో ప్రొడ్యూస్ చేసే పద్ధతి, ఇతర అంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. కేసులు వీగిపోకుండా సరైన పద్దతిలో సమన్వయంతో నిందితులకు శిక్షపడేలా కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్ నేరాల్లో తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేస్తామని, అట్టి సొమ్మును భాదితులకు అందజేయుటలో సంబంధిత మేజిస్ట్రేట్ ల యొక్క అనుమతి ద్వారా బాధితులకు త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండిరగ్ లో వుండి సీసీ నెంబర్లు రాని కేసులకు, నంబర్లు తీసుకోవాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న నూతన చట్టాలను అమలుచేసే సమయంలో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి ప్రసాద్, ఏసీపీ లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇతర అధికారులు సిబ్బంది, పాల్గొన్నారు.