జనత న్యూస్ :
తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో భారీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా..హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కోరింది.
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

- Advertisment -