తెలంగాణలో తెలుగు దేశం బలోపేతంపై ఆ పార్టీ అధినేత, ఏసీ సీఎం చంద్రబాబు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పలువురితో ఆయన చర్చిస్తున్నారు. గతంలో ఎల్ రమణ, కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని వీడాక తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు పెద్దగా లేకుండా పోయాయి. ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆ పార్టీలో కీలకంగా పని చేసిన పలువురితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరబోతున్నట్లు బాహాటంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజ శేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారెడ్డి సైతం చంద్రబాబును కలిశారు. అయితే..తన మనుమ రాలు శ్రేయా రెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు వెళ్లినట్లు మల్లారెడ్డి ప్రకటించారు. అయితే..తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించడం పలు చర్చలకు దారి తీస్తుంది. ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తారన్నది హాట్ టాఫిక్‌గా మారింది.
తెలంగాణాలో టీడీపీలోకి వెళుతుంది ఎవరు ?

- Advertisment -