ఎగుమతుల్లో 11.3 శాతం పురోగతి
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణా మూడిరతల వృద్ధి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన ఓ సదస్సులో సాఫ్ట్‌వేర్ రంగం పురోగతి, భవిష్యత్ లక్ష్యాలపై ఆయన వివరించారు. 2024-25 మొదటి మూడు నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు కేవలం 3.3 శాతం మాత్రమే పెరగగా..తెలంగాణలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 11.3 శాతం వృద్ధి నమోదు చేసుకుందని పేర్కొన్నారు. గత ఏడాది ఐటీ రంగంలో 40,570 కొత్త ఉద్యోగాలు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కృత్రిమ మేథను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. హెల్త్ కేర్, వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగం విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. దేశంలోనే తెలంగాణా ముందుకు దూసుకెళ్తున్న రాష్ట్రంగా నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణలో శర వేగంగా సాఫ్ట్‌వేర్..
- Advertisment -