తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వివాదం మరువక ముందే..తాజాగా అత్యంత పవిత్రంగా భావించే కేరళ శబరిమల అరవణ ప్రసాదం కల్తీ తెరపైకొచ్చింది. గత సంవత్సరం తయారు చేసిన ఆరున్నర లక్షల కంటైనర్లలోని ప్రసాదం డబ్బాల్లో క్రిమి సంహారకాలు ఉన్నాయన్న విషయం బహిర్గతం అయింది. ప్రసాదంలోని యాలకుల్లో కలుపాల్సిన దాని కంటే అధికంగా ఎక్కువగా కెమికల్స్ కలిశాయని నిర్థారించినట్లు తెలుస్తుంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ ప్రసాదాన్ని ఎరువుగా మార్చేందుకు టెండర్లు పిలిచారు. కాగా..బెల్లం, బియ్యంతో తయారు చేసిన శబరిమల ప్రసాదం అత్యంత శ్రేష్టంగా, భక్తితో స్వీకరిస్తారు భక్తులు. శబరిమలై దర్శనానికి వెళ్లి వచ్చిన భక్తులు తప్పకుండా అరవణ ప్రసాదాన్ని తీసుకొచ్చి పంచుతారు. కేరళ లోని శబరిమలై ఆలయానికి గత ఏడాది రూ. 140 కోట్లకు పైగానే అరవణ ప్రసాదం ద్వారా ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. ప్రసాదం కల్తీకి గల కారకులెవరు..? ఎవరిపైచర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
శబరిమల అరవణ ప్రసాదంలోనూ..

- Advertisment -