సీబీఐ విచారణను ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలైన బెంగాల్, తమిళనాడు, కేరళలో సీబీఐకి గేట్లు మూసివేయగా తాజాగా ఇందులో కర్ణాటక చేరింది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య కుటుంబం ముడా కేసు విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారణకు ఒప్పుకోబోమని కర్ణాటక సీఎం ప్ర్రకటించడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆ రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. సీబీఐ దర్యాప్తు సంస్థ ఏక పక్షంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా విషయమై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ గోద్రా ఉదంతంలో అప్పటి సీఎం నరేంద్ర మోదీపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నేపథ్యంలో రాజీనామా చేయలేదనే విషయాన్ని గుర్తు చేశారు. విపక్ష ప్రభుత్వాల్లోని ముఖ్యంత్రులు, ఇతర నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు, విచారణలు చేపట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్ణాటకలోనూ సీబీఐకి నో ఎంట్రీ !

- Advertisment -