హర్యాణలో కాంగ్రెస్ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీపై తీవ్ర వ్యతిరేక ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ గెలువ లేక పోవడం ఆశ్చర్యం కల్గిస్తుందని పేర్కొన్నారు. ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ చెప్పడాన్ని ఆయన తప్పు పడ్టారు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఓవైసీ ప్రశ్నించారు. కాగా..హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు ప్రకటించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుంది.
హర్యానలో అతి విశ్వాసంతోనే కాంగ్రెస్ ఓటమి
- Advertisment -