దుబ్బాక-జనత న్యూస్
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల పంపిణీల్లో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు సైతం తాము సైతం అంటూ పాలు పంచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నిన్న జిల్లా అభివృద్ధి సమీక్షలో..నేడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కుల పంపిణీలో సైతం వారు పాల్గొన్నారు. దుబ్బాక నియోజక వర్గ కేంద్రంలో కేఆర్‌ఆర్ ఫంక్షన్ హాలులో పలు మండలాల లబ్ధిదారులకు జిల్లా ఇంఛార్జి మంత్రి కొండ సురేఖ కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీెనివాస్ రెడ్డి, ఆర్డీవో సదానందం, దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు

- Advertisment -