కరీంనగర్-జనత న్యూస్
క్యారెట్ మాలల అలంకరణలో దర్శనమిచ్చారు దుర్గా భవాని అమ్మవారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ఆషాడ మాస శాఖాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ ధర్మాధికారి, వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో రోజుకో విధంగా అమ్మవారిని అలంకరిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా శనివారం అమ్మవారిని క్యారేట్ మాలలతో అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ వంగల లక్ష్మన్, కార్పోరేటర్ వంగల శ్రీదేవి, ఆలయ కమిటి బాధ్యులు, భక్తులు పాల్గ్గొన్నారు.
క్యారేట్ మాలల అలంకరణలో దుర్గాభవానీ అమ్మవారు
- Advertisment -