బైపాస్ మొత్తం లైటింగ్..
అన్ని శాఖల సమన్వయంతోనే..
ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం
వివిధ శాఖల అధికారులతో సీపీ సమావేశం
కరీంనగర్-జనత న్యూస్
నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగు పర్చాలన్నారు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి. నగరంలోని పోలీస్ కమీషనరేట్‌లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల సంఖ్యను పెంచి వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. నగరంలో అవసరమైన చోట్ల మాత్రమే యూ టర్న్ ల ఏర్పాటు చేసి. అక్కడ సోలార్ లైట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్డు మొత్తం లైటింగ్ ఉండేలా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు. అదే విధంగా రోడ్డు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు శాఖల వారీగా అధికారులతో చర్చించారు. ఆయా శాఖల్లో పెండిరగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంఛార్జి కమీషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ డీసీపీ ఎ లక్ష్మి నారాయణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి , ఈఈ లక్ష్మణ్, ఆర్ అండ్ బి ఎస్‌ఈ భూపతి రెడ్డి, ఆర్ టి సి డిప్యూటీ ఆర్ ఎం, విజయభాస్కర్, హెచ్ కెఆర్ , జిశ్రీకాంత్, స్మార్ట్ సిటీ సంస్థ ప్రతినిధి బి శ్రీకాంత్ ఎం.వి. ఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.