టాలీవుడ్ నటుడు సుహాస్ లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’. ఈ మూవీనికి అర్జున్ వైకే డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో సుహాస్ తో పాటు పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లు. అర్హ మీడియా బ్యానర్ పై వస్తున్న ఈ మూవీని మణికంట జేఎస్ ప్రసాద్ రెడ్డి, టీఆర్ సంయుక్తగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.
సుహాస్ వింత వ్యాధితో బాధపడుతాడు. ఒక మొహం తప్ప అన్ని గుర్తుండే ఈ వ్యాధి సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది కథాంశం. విభిన్నమైన కథతో వస్తున్న ఈ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ మూవీ టీజర్ వైరల్ గా మారుతోంది.