అభినందించిన జిల్లా కలెక్టర్
అట్టహాసంగా జిల్లాస్థాయి యోగా పోటీలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి యోగాసనా పోటీలు ఆకట్టుకున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ పమేల సత్పతి హాజరై మాట్లాడారు. పాఠశాలలు, ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకుడదని, యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు. కరీంనగర్ క్రీడా ప్రాంతీయ పాఠశాలలో 2006 నుండి ఇప్పటివరకు ఒక్క విద్యార్థి ఫెయిల్ కాలేదన్నారు. యోగ ఒక కరికులంగా భావించాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగ ఆసనాలు చూస్తే ఆనందం, గర్వంగా ఉందన్నారు. వీరిలో ఎముకలు , కండరాలు ఉన్నాయా , రబ్బర్ బాండ్ లా సాగుతూ చేసిన యోగాసనాలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనం అని కొనియాడారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి పోటీలో సైతం మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. భవిష్యత్తులో జాతీయస్థాయి యోగా పోటీల వేదికగా కరీంనగర్ నిలవాలన్నారు.
అనంతరం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు సర్ధార్ రవీందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎన్. సిద్ధారెడ్డి, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. జనార్దన్ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి. రమేష్ రెడ్డి, డి ఈ ఓ కార్యాలయం సూపర్డెంట్ ఎం నరసింహస్వామి, జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి వేణుగోపాల్, యోగా కోచ్ లు సంపత్ కుమార్, కిష్టయ్య, రామకృష్ణ , మల్లేశ్వరి, అశోక్, కోటేశ్వరరావు పాల్గొన్నారు