ఇల్లంతకుంట, జనతా న్యూస్ : ఇల్లంతకుంట మండలంలోని పలువురు బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల నామినేషన్ల ముందు చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఒకేసారిగా జోష్ పెరిగింది. ఎన్నికల కంటే ముందు స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు చేరిక వల్ల పార్టీలో ఒకేసారి ఊపు పెరిగింది. మండల ఎంపీపీ నాయకులు ఉట్కూరి రమణారెడ్డి మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్ ఇల్లంతకుంట పాక్స చైర్మన్ రాఘవరెడ్డి ఓబులాపూర్ మాజీ సర్పంచ్ కేశవరెడ్డి వేల్జీపూర్ మాజీ సర్పంచ్ గుండా వెంకటేశం ముస్కానిపేట సర్పంచ్ వెంకట్రావు పల్లె సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంది కందికట్కూర్ వల్లంపట్ల పెద్ద లింగాపూర్ రేపాక ఎంపీటీసీలు కూడా తమ అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీలో చేరినందున పార్టీ ప్రాబల్యం ఆయా గ్రామాల్లో పుంజుకుంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటించడంతో మండల కాంగ్రెస్ పార్టీలో ఒకేసారిగా ఉప్పెనెల ఊపందుకుంది అని మండల ప్రజలు భావిస్తున్నారు. మండల ప్రజల్లో మౌత్ పబ్లిసిటీ కూడా కాంగ్రెస్ వైపే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ గాలి ఒకేసారి రూపొందుతుందని పలువురు మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా గెలుపు ఓటములు ఎవరిని వరుస్తాయో చివరిదాకా వేచి చూడక తప్పదని మండల ప్రజలు చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ లో చేరిన ఇల్లంతకుంట ఎంపీపీ
- Advertisment -