ఎవరూ చూస్తలేరని, సీక్రెట్‌గా ఆశ్లీల వీడియోలు చూస్తున్నారా..? వాటిని మీ స్నేహితులకు షేర్ చేస్తున్నారా..? మీ సమాచారం వెంటనే పోలీసులకు తెలిసి పోతుంది. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి జైలులో పెడుతారు తస్మత్ జాగ్రత్త ! చిన్నారులు, మహిళలలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు..కీచకుల కదలికలు కనిపెట్టేందుకు అమెరికాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ పోలీసు. ఎవరైనా అశ్లీల చిత్రాలు చూస్తే, అతని ఐపీ, ఫోన్ నెంబర్, లొకేషన్‌ను కనిపెట్టి తెలంగాణ పోలీసులకు సమాచారం అందిస్తుందట. దీంతో వారిపై కొత్త న్యాయ చట్టాల్లోని పోక్సో, ఐటి కింద కేసు నమోదుచేసి శిక్షిస్తారని రాచకొండ సీపీ సుదీర్‌బాబు తెలిపారు. దీనిపై రాచకొండ పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అశ్లీల చిత్రాలు చూడాలనుకుంటున్న వారెరైనా..ఆ ప్రయత్నం మానుకోవాల్సిందే. లేదంటే కట కటాలే !!
ఇక ఆ వీడియోలు చూస్తే..ఇక కట కటాలే !

- Advertisment -