తాను ఎన్నికల్లో విజయం కోసం కాదని,ప్రజల అభివృద్ది కోసం పనిచేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నార్త్ ఈస్ట్ లో మోదీ గ్యారెంటి ఫలితాలు వస్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈశాన్య ప్రాంతంలో 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మించారని, కానీ మేము 10 ఏళ్లో 6 వేల కిలోమీటర్ల రహదారి నిర్మించామన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని పనులు మేం 10 ఏళ్లలో చేశామన్నారు. నార్త్ ఈస్ట్ లో రూ.55 వేల కోట్ల విలువైన పనులు అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు.