హనుమకొండ, జనతా న్యూస్
విశ్వాస జంతువుల్లో కుక్క ఒకటి.. చాలామంది. ఇళ్లలో రకరకాల పెంపుడు కుక్కలను పెంచుకుంటూ జంతు జాతి పై ప్రేమను “ఓలకబోస్తారు. వేల నుండి లక్షల రూపాయలను వెచ్చించి కుక్కలను కొనుగోలు చేసి ఇళ్లలో కాపలాకు కొందరు, సరదా కోసం మరికొందరు పెంచుకోవడం కామన్ అయిపోయింది.. కానీ కుక్క కాటుతో రేబిస్ వ్యాధి వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇక్కడో విషయం జంతు ప్రేమికులు తెలుసుకోవాల్సి ఉంది. కుక్క కాటేస్తేనే కాదు, కుక్క గోర్లతో గీరిన టీకా వేసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క గోర్లతో గీరితే టీకా వేయించుకోవాలా ! వద్దా అన్న సందేహాలు చాలా మందిలో మొదలాడుతూనే ఉన్నాయి.. వారికోసం వైద్యులు సలహా ఇస్తూ ఇంట్లో పెంచుకునే కుక్కలు గీరితే టీకా వేయించుకోవాలని చెబుతున్నారు. కుక్కలు తమ కాళ్ళను నోట్లో పెట్టుకున్నప్పుడు లాలాజలం గోర్లలోకి వెళ్తుందట. దాంతో రేబిస్ కారక వైరస్ గోర్లలోకి వెళ్లి తద్వారా మన శరీరంలోకి పోయే ఛాన్స్ ఉంది. కనుక జాగ్రత్తలు తప్పనిసరి అని, టీకా వేయించుకోవడం శ్రేయస్కరమని వైద్యులు సలహా ఇస్తున్నారు.. మీ ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారా అయితే ఇవన్నీ తెలుసుకోండి..