ICID Pleenary : ఇంటర్నేషనల్ కమిషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు (ఐసీఐడీ) సదస్సును భారత్ లోని విశాఖలో నవంబర్ 8న నిర్వహించనున్నారు. 57 సంవత్సరాల తరువాత భారత్ లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు విశాఖ వేదిక కావడం విశేషం. సెంట్రల్ వార్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ కలిసి రాడిసన్ బ్లూ హోటల్ లో జరిగే ఈ సదస్సును గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, ఐడీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాయుడు పాల్గొన్నారు. దేశం నుంచి 300 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. అలాగే 74 దేశాల నుంచి 900 మందికి పైగా ప్రతినిధులు రానున్నారు. ఈ సదస్సు 74వది కావడంతో 74 దేశాల నుంచి ప్రతినిధులు కావడం ఆకర్షణీయంగా మారింది. నవంబర్ 8న సదస్సులో పలువురు కీలక ఉపన్యాసాలు చేయనున్నారు. 9న అరకు వ్యాలీ, బొర్రా గుహలు తదితర పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ICID Pleenary : విశాఖలో ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం..
- Advertisment -