హైడ్రా సంస్థకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. శాసన సభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే..ఆరు మాసాల గడువు ఉండటంతో హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. హైడ్రాకు చట్ట బద్దత లేదని కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో కొంత ప్రభుత్వానికి వెసులుబాటు కలిగింది. బయో టెక్నాలజీ, ఇన్‌ఫర్మెషన్ టెక్నాలజీ, ఫార్మ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో వారికి అనుమతులు, ఇతరాత్ర అంశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతం మూసీ కూల్చివేతలతో ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాదానాలు చెప్పాల్సి వస్తుంది. త్వరలో అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
హైడ్రాకు గవర్నర్ ఆమోదం..ఇక కోర్టులో..

- Advertisment -